షూటింగ్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేసే బాలయ్య, పవన్ లు.. ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు..? – రోజా

-

చంద్రబాబు, బాలకృష్ణ,పవన్ కళ్యాణ్.. ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు..? రాజీనామా చేసి వెళ్లొపోండి అంటూ ఫైర్‌ అయ్యారు వైసీపీ నేత రోజా. బాలకృష్ణ.. షూటింగ్ లు చేస్తూ, ఎంజాయ్ చేసుకునే వారైతే.. ఎందుకుండీ మీకు పాలిటిక్స్ అంటూ నిలదీశారు. బాలకృష్ణ నియోజకవర్గంలో అత్తా కూతుళ్లను రేప్ చేస్తే.. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. మీకు మానవత్వం లేదా..? అని ప్రశ్నించారు వైసీపీ నేత రోజా.

చంద్రబాబు ప్రభుత్వ చేతగాని తనం వల్లే.. 120 రోజుల్లో 74 కు పైగా ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు జరిగాయని వైసీపీ నేత రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ స్టాపబుల్ షో లో.. నిస్సిగ్గుగా నవ్వుతూ బావా బామ్మర్ధులు ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహించారు. మృత్యువుతో బాధిత మహిళ పోరాడుతుంటే.. స్పెషల్ విమానంలో హైదరాబాద్ కు చంద్రబాబు వెళ్లినట్లు చురకలు అంటించారు. వీళ్లకా మేము ఓటేసిందని ప్రజలు బాధపడుతున్నారన్నారు రోజా. పవన్ కళ్యాణ్.. షూటింగ్ లో బిజీగా ఉన్నారా..? అంటూ సెటైర్లు పేల్చారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసిందని నిలదీశారు వైసీపీ నేత రోజా.

Read more RELATED
Recommended to you

Latest news