కాణిపాకంలో రోజా పర్యటన.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

-

ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకంలో ఇవాళ ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటించారు . కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు మంత్రి రోజా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ధర్మ ప్రచార పరిషత్, స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం వారి సంయుక్త ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మాసోత్సవాలు జరగనున్నాయి. దేవస్థానం ప్రచార రధం చిత్తూరు జిల్లాలోని వెనుకబడి ప్రాంతాలు మారుమూల గ్రామాల్లో విస్తృతంగా ధర్మ ప్రచారాన్ని నిర్వహించుటకు కాణిపాకం దేవస్థానం నందు నిర్వహించుటకు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ ఘనంగా స్వాగతం పలికారు.


ప్రత్యేక దర్శనం కల్పించి స్వామి వారి శేష వస్త్రం తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు,వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు.తర్వాత ఆస్థాన మండపంలో మంత్రి ఆర్కే రోజా, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈఓ వెంకటేష్ ,జ్యోతి ప్రజ్వలన చేసి, సభ కార్యక్రమాన్ని ప్రారంభించారు.మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇంత మంచి అవకాశం తనకు కల్పించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news