AP Budget 2022: రూ. 2,56,256 కోట్ల‌తో ఏపీ బడ్జెట్‌.. ఏ శాఖకు ఎన్ని కోట్లు అంటే ?

-

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కాసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీలో లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2022 -23 ఏపీ వార్షిక బడ్జెట్ ను రూ. 256256 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు.ఇక ఇందులో రెవెన్యూ వ్యయం రూ.208261 కోట్లు అని, మూలధనం వ్యయం రూ.47,996 కోట్లు అని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన. ఇక రెవెన్యూ లోటు రూ. 17036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు రూ. 48724 కోట్లుగా ఉందని మంత్రి అసెంబ్లీ లో ప్రకటన చేశారు.

2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ. 2,08, 261 కోట్లు

మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు

రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు

ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు

వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు

వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు

అటవీ శాఖ రూ.685 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు రూ.8581 కోట్లు.

వైద్యశాఖకు 15,384 కోట్లు.

హోంశాఖకు రూ.7586 కోట్లు.

కార్మిక శాఖకు రూ.790 కోట్లు.

మున్సిపల్ శాఖకు రూ.8796 కోట్లు.

మైనార్టీ శాఖకు 2063 కోట్లు.

పంచాయతీరాజ్ శాఖకు 15,826 కోట్లు.

హౌసింగ్ కు రూ.4791 కోట్లు.

ఇరిగేషన్ 11,482 కోట్లు

మౌళిక వసతులు 1142 కోట్లు.

పౌరసరఫరాలకు 3719 కోట్లు.

పరిశ్రమలు వాణిజ్యం 2795 కోట్లు.

ఐటీశాఖకు రూ.211 కోట్లు.

న్యాయశాఖకు 924 కోట్లు

రెవెన్యూ శాఖకు 5306 కోట్లు

వృత్తి నైపుణ్యం 969 కోట్లు

వ్యవసాయకు 11,387 కోట్లు

పశుసంవర్ధన శాఖకు 1568 కోట్లు

ఉన్నత విద్యకు 2014 కోట్లు

సాంఘిక సంక్షేమ శాఖకు 12,768 కోట్లు

సెకండరీ ఎడ్యుకేషన్ 27,706 కోట్లు.

విద్యుత్ 10,281 కోట్లు

క్రీడాశాఖకు రూ.290 కోట్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version