
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. జీఆర్‌పీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. లింగంపల్లి-చందానగర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీ కొనడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. శరీరం సగానికి తెగి పడి ఉంది. జేబులో మద్యం బాటిల్ ఉండడంతో మందు తాగి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఉంటుందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.