ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్త !

-

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నానికి కాంగ్రెస్ కార్యకర్త పాల్పడ్డారు. అన్ని అర్హతలు ఉండి..కాంగ్రెస్ కార్యకర్తనైన నాకే ఇల్లు రాకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్త. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్, అతని భార్య సృజన.

Congress worker attempts suicide after Indiramma fails to come home
Congress worker attempts suicide after Indiramma fails to come home

ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఎన్నిసార్లు నిలదీసినా జాబితాలో తమ పేరు రాలేదని సుందరగిరిలోని కరీంనగర్–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు శ్రీనివాస్, సృజన దంపతులు. ఈ నేపథ్యంలో భార్యపై పెట్రోల్ పోసి అనంతరం తన ఒంటిపైన కూడా పెట్రోల్ పోసుకున్నారు శ్రీనివాస్. ఇక చికిత్స నిమిత్తం వారిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news