PSLV C 56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది – ఇస్రో ప్రకటన

-

శ్రీహరికోటలో PSLV C-56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. దీంతో సంబరాలు జరుపుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ మాట్లాడుతూ.. PSLV C 56 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని వివరించారు.

సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి రాకెట్ చేర్చిందని వివరించారు. సెప్టెంబర్ లో మరో P S L V ప్రయోగం ఉంటుందన్నారు. రాకెట్ ప్రయోగాల్లో వివిధ పరిశ్రమల సహకారాన్ని మరింతగా తీసుకుంటామని వివరించారు. గగన్ యాన్… SSLV..GSLV మార్క్ 3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామన్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news