జగన్ ఎన్నికల్లో గెలిచాక ఎస్వీబీసి చైర్మన్ గా నియమించబడిన నటుడు పృథ్వి రాజ్ ఆ తరువాత ఒక లేడీ వ్యవహారంలో తన పదవికి రాజీనామా చేసారు. ఆ తర్వాత ఛానల్ కి పూర్తి స్థాయి చైర్మన్ ని నియమించలేదు. అప్పట్లో దేవస్థానం డిప్యూటీ ఈఓకే ఈ బాధ్యతలు అదనంగా అప్పగించారు. అయితే తాజాగా ఈ పదవిని మాజీ ఎమ్మెల్యే, సంగీత విద్వాంసుడు అయిన సాయి కృష్ణ యచేంద్రను నియమించింది ఏపీ ప్రభుత్వం.
ఈయన గతంలో నెల్లూరు జిల్లా వేంకటగిరి ఎమ్మెల్యేగా పనిచేసారు. ఈయన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. నిజానికి ఈ ఎస్వీబీసీ చైర్మన్ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిలో ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న, మంగలి కృష్ణ, జగన్ లకు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేరు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు ఇదే చానల్ కు డైరెక్టర్ గా ఉన్నారు. అయితే వీరిని కాదని ఈయన్ని తెర మీదకు తేవడం చర్చనీయాంశంగా మారింది.