వివేకా కేసులో జగన్ పేరు ప్రస్తావించడం పెద్ద కుట్ర అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని.. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనం అని చెప్పారు.
సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందని.. వివేకా హత్య కేసులో అవినాష్‌ను, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటూ వస్తోందని ఆగ్రహించారు. ఒక స్క్రిప్టు రాసుకుని.. దాని విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం… ఎలాంటి ఆధారాలు లేకుండా చవకబారు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేవలం సెన్షేషనలైజేషన్‌కోసమే ఇవన్నీ చేస్తున్నారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఈ ఎల్లోమీడియాకు ఎలా ముందుతెలుస్తోందని వెల్లడించారు.