చంద్రబాబు జైల్లో ఒక కేజీ బరువు పెరిగారని.. 5 కేజీల బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మిగిలిన ఖైదీలు మనుషులు కారా?? అవసరం లేనన్ని సదుపాయాలను కల్పించామన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు మరో కొత్త డ్రామాకు తెర లేపారని ఆగ్రహించారు.
చంద్రబాబు ఆరోగ్యం విషమించింది అని , ప్రాణాలకు ప్రమాదం ఉందని ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. ఈ ప్రచారం పరాకాష్టకు చేరిందన్నారు. ప్రభుత్వం స్టెరాయిడ్స్ ఇవ్వాలని చూస్తోందని లోకేష్ ట్వీట్ చేశాడని తెలిపారు. ట్వీట్ లో ప్రస్తావించిన ఇన్ఫెక్షన్లు, దోమలు, స్కిన్ సమస్యలు వంటివి ప్రస్తావించాడు,,,వీటిలో ప్రాణాంతకం ఏంటో అర్థం కాలేదన్నారు. నిన్నటి వరకు చంద్రబాబును 20 ఏళ్ళ యువకుడు అంటూ కీర్తించారని వెల్లడించారు సజ్జల. చేసిన తప్పు మీద మాట్లాడండి…జైలు ఏమైనా అత్తగారి ఇల్లా?? అని ప్రశ్నించారు. ఏసీలు కావాలని అడగటం విచిత్రంగా ఉందని.. ప్రపంచంలోనే ఎకైక హక్కు చంద్రబాబుకే ఉండాలనే విధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని చురకలు అంటించారు వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.