సుప్రీంకోర్టు తీర్పు పై స్పందించిన సజ్జల

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కాల పరిమితితో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ విషయంలో హైకోర్టు తన పరిధి దాటిందని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే సుప్రీం తీర్పు పై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల.

మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజన్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని.. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని సుప్రీం కోర్టు భావించిందన్నారు. ప్రభుత్వ విధానం తప్పోపులని నిర్ణయంచాల్సింది ప్రజలే….ప్రజా కోర్టులోనే అన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలు ఏవి చేసినా ..సహజ న్యాయానికి, సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలని …అలాంటపుడు మిగిలిన వ్యవస్థలు జోక్యం చేసుకోరాదన్నారు. సీఎం జగన్ ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకున్నందుకు వైసీపీ కి అన్ని ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం ఇచ్చారని అన్నారు. ఒకే రాజధాని ఉండాలి, అక్కడే అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకొని ఉంటే గత ఎన్నికల్లో వ్యక్తమయ్యేదన్నారు. అమరావతి లోనే చంద్రబాబు నిర్ణయానికి మద్దతు లభించలేదని..అందుకే జనం తిరస్కరించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version