దిల్ రాజు : అంతా కార్ వాన్ సంస్కృతి వల్లే.!

-

తెలుగు సినిమా పరిశ్రమ లో దిల్ రాజు పేరు పరిచయం అక్కర్లేదు. చిన్న డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టి ప్రస్తుతం పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు.ఇక ప్రస్తుతం దిల్ రాజు పేరు మీడియాలొ హాట్ టాపిక్ గా మారింది. తన వారసుడు సినిమా రిలీజ్ విషయంలో వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి.

ఇక ప్రస్తుతం  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం ప్రోమోలో కనిపించారు. అసలే వివాదాలు నడుస్తున్న కాలంలో ఈ ఇంటర్వ్యూ  రావటం తెలుగు సినిమా పరిశ్రమ లో సంచలనంగా మారింది. దీనిలో చాలా విషయాలపై కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడినట్లు కనబడుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా బడ్జెట్ పెరగటానికి కార్ వాన్ సంస్కృతి కూడా ఒక కారణం అని అన్నారు. హీరోలు, హీరోయిన్స్, నటీనటులు అందరు కార్ వాన్ లో ఉండటం వారిని పిలవాలంటే ముందు అసిస్టెంట్స్ కు చెప్పడం, వారు మళ్లీ వారికి చెప్పడంతో ,వారు వచ్చే సరికి చాలా టైమ్ వేస్ట్ అయి బడ్జెట్ పెరిగిపోతోంది అన్నారు. అలాగే గత రోజులలో  ఉదయం 7గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుందని కాని అలంటి పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version