చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్..!

-

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లడ్డుపై దుర్మార్గపు వ్యాఖ్యలు చంద్రబాబు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని అన్నారు. ఆ రోజే వైవీ సుబ్బారెడ్డి కోర్టును కూడా ఆశ్రయించారన్నారు. చంద్రబాబు చేసిన అపచార మామూలుగా ప్రజల్లోంచి వెళ్ళవన్నారు. ఆ పాపం చంద్రబాబుదే అనే నిజం ప్రజలకు తెలియాలన్నారు.

అయోధ్య రామాలయం వారు కూడా ఇక్కడి విధానం నచ్చి ఇక్కడి నుంచి తీసుకోవడానికి ముందుకు వచ్చారన్నారు. కల్తీ లేకుండా ప్రసాదాలు, భోజనాలు అందించిన చరిత్ర టీటీడీదని.. ఇప్పుడు ఆ నమ్మకాన్ని చంద్రబాబు పోగొట్టే ప్రయత్నం చేశాడన్నారు. జంతువుల కొవ్వు ఉన్నట్లు ఏ రిపోర్టులోనూ చూపించడం లేదన్నారు. నాణ్యతా లోపం ఉన్న ఏ ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా మేము లోనికి రానివ్వలేదని ఆయన వెల్లడించారు. స్వయంగా చంద్రబాబు కొడుకు లోకేష్ కుమార్ ట్యాంకర్ లోనికి వెళ్లలేదు అంటున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం పదే పదే ట్యాంకర్ లోనికి వెళ్లిందని అనడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version