BSNL కొత్త ప్లాన్ వచ్చేసింది..!

-

టెలికాం లో ఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా బీఎస్ఎన్ఎల్ ప్రతిభ ఎప్పుడూ మసక బారలేదు. ప్రైవేటు రంగానికి  ధీటుగా ప్రభుత్వ సంస్థ ఎప్పటికప్పుడూ దూకుడుగా వెళ్తూనే ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్ వర్క్ చాలా వేగంగా విస్తరించేందుకు పరుగులు పెడుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది. తాజాగా తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 60 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది.

ఈ ప్లాన్ తో అపరిమిత కాలింగ్ కూడా పొందవచ్చు. అయితే ఇందులో బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హర్డీ గేమ్స్ తరహా సదుపాయాలు మాత్రం అందుబాటులో ఉండవు. ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్ లను పెంచేశాయి. బీఎస్ఎన్ఎల్ మాత్రం అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఫలితంగా చాలామంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ ప్లాన్లపై మొగ్గుచూపుతున్నారు. తాజా ప్లాన్లతో మరింత కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version