స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు అయిన చంద్రబాబు విషయంలో CID 17A పాటించలేదని ఆయన తరపు లాయర్ హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో వాదించారు. ‘ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా 17A ద్వారా రక్షణ ఉంటుంది. చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదు.
2018 జూలై 18కి ముందు జరిగిన నేరాలకు 17A వర్తించదని హైకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదు. కక్షపూరితంగా బాబుపై కేసులు పెట్టారు’ అని సాల్వే సుప్రీంకు వివరించారు. ఇది ఇలా ఉండగా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. గవర్నర్ అనుమతి లేకుండా తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని బాబు పిటిషన్ వేయగా… జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా, త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇక చివరికి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి విచారణను వాయిదా వేసింది. దీంతో చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది.