ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కాలేదన్నారు మంత్రి సత్యకుమార్. చిట్‌చాట్‌లో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని కోవిడ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉన్నాం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ కిట్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్.
ఇక అటు ముంబైలో కరోనా సోకి ఇద్దరు మృతి చెందారు. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో కరోనాతో 14 ఏళ్ల బాలుడు సహా 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. అయితే వారిలో ఇతర అనారోగ్యాలు కూడా ఉన్నాయని తెలిపారు వైద్యులు.