BREAKING : రెండో విడతగా “వైయస్ఆర్ రైతు భరోసా” విడుదల

-

BREAKING : ఏపీ రైతులకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. రెండో విడతగా “వైయస్ఆర్ రైతు భరోసా” విడుదల చేశారు సీఎం జగన్‌. పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్‌… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు రూ. 2200 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నామని… 53 లక్షల 53 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం చేసినట్లు వివరించారు.

second installment of YSR Rythu Bharosa is released

రైతులు ఇబ్బందులు పడకూడదనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోందన్నారు. కేంద్రం పీఎం కిసాన్‌ డబ్బులు కూడా ఈ నెలలోనే వస్తాయని చెప్పారు సీఎం జగన్‌. నేడు అందిస్తున్న రూ.4,000 సాయంతో కలిపి మన ప్రభుత్వం కేవలం ఒక్క రైతు భరోసా – PM KISAN పథకం ద్వారా మాత్రమే ఇప్పటి వరకు ఒక్కో రైతన్నకు అందించిన మొత్తం సాయం రూ. 65,500 అన్నారు సీఎం జగన్‌. రైతుల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version