కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బయటపడటంతో విద్యార్థినులు రాత్రంతా ఆందోళనకు దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అతడిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, ఈ ఘటనపై తాజాగా ఏపీ మంత్రి నారాలోకేశ్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘హిడెన్ కెమెరా ఆరోపణలపై విచారించి తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అంతేకాకుండా కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి’ అని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.