ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలు వారికేనా..? టిడిపిలో ఇదే హాట్ టాపిక్..

-

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేట్ అయిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేశారు.. ఇవాళో రేపో వారు తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు.. అయితే వారికి టిడిపి నుంచి స్పష్టమైన హామీలే వచ్చినట్లు ఆ పార్టీలో చేర్చి నడుస్తుంది.. బీద మస్తాన్ రావు మొదటి నుంచి టిడిపి సానుభూతిపరుడే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ద్వారా ఆయన వైసీపీలో చేరి రాజ్యసభ సీట్లు సంపాదించుకున్నారు.. గత ఎన్నికల్లో కూడా విజయ్ సాయి రెడ్డి గెలుపు కోసం అయన పనిచేయలేదని టాక్ నెల్లూరు జిల్లాలో వినిపిస్తోంది.

మరో నాలుగేళ్ల పాటు ఆయనకి రాజ్యసభ పదవీకాలం ఉండగా.. సడన్ గా ఆయన పదవికి రాజీనామా చేశారు.. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆయన స్థానంలో.. టిడిపి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ని రాజ్యసభ పంపాలని ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ప్రచారం జరుగుతుంది.. ఆశావాహులు చాలామంది ఉన్నప్పటికీ చంద్రబాబు ఆయన వైపే ముగ్గు చూపుతున్నారట.

మరో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ.. వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వెంకటరమణని వైసీపీ అధినేత జగన్ రాజ్యసభకు పంపారు.. ఆయన కూడా రాజీనామా చేయడంతో ఆయన స్థానాన్ని నాగబాబుకి కేటాయిస్తారని ప్రచారం జనసేనలో సాగుతుంది. నాగబాబును పెద్దల సభకు పంపాలని ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. గత ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ.. సీఎం రమేష్ కోసం తన సీటును ఆయన త్యాగం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో నాగబాబుకి రాజ్యసభ చాన్స్ వచ్చే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..

అయితే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన అనంతరం ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని టిడిపి నేతలు మాట్లాడుకుంటున్నారు.. వెంకటరమణ కుమారుడి భవిష్యత్తు కూడా తానే చూసుకుంటారని చంద్రబాబు హామీ ఇచ్చారని.. దీంతో వెంకటరమణ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టిడిపిలో చర్చ నడుస్తుంది.. మొత్తానికి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు గల్లా జయదేవ్ నాగబాబును నామినేట్ చేస్తారనే టాక్ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version