దమ్ముంటే చంద్రబాబు గుడివాడలో పోటీ చేయాలి : కొడాలి నాని

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని. ముఖ్యంగా గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారం పై స్పందించారు. గుడివాడలో ఎవ్వరూ పోటీ చేయాలో సీఎం వైఎస్ జగన్ చెబుతారని స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు కూడా సీఎం జగన్ సీటు ఇచ్చారు. బ్రోకర్ పనులు.. పైరవీలు చేస్తానో డబ్బు ఉందనో.. ఎవరో చెప్పారని వైసీపీలో సీట్లు ఇవ్వరని స్పష్టం చేశారు కొడాలి నాని.

చంద్రబాబు మగాడు అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీనే పోటీ చేస్తాడని స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే నాకు, వంశీ కి సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఫ్లెక్సీల విషయం పై స్పందిస్తూ.. ఎవ్వరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవ్వడైనా కట్టవచ్చు. కానీ అర్థవంతంగా ఉండాలిగా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version