టీడీపీ కి భవిష్యత్ లేదన్న వారందరికీ యువగళం నారా లోకేష్ సమాధానం చెప్పారని వర్మ గుర్తుకు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని సీఎం అని పిలుస్తున్నారని.. టీడీపీని బలోపేతం చేసి.. కార్యకర్తలకు మనోధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పు ఏంటి అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాము అంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు వర్మ.
మరోవైపు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను జనసేన సీరియస్ గా తీసుకుంది. తమ అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆ పదవీని లోకేష్ కు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కౌంటర్ గా రెండున్నరేళ్లుగా సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు.