దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికా? – షర్మిల

-

దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? అంటూ సీఎం జగన్‌ పై షర్మిల ఫైర్‌ అయ్యారు. మళ్లీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? మళ్లీ ప్రత్యేక హోదాను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా? అంటూ నిలదీశారు. మళ్లీ పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి సిద్ధమా? అని ఆగ్రహించారు.

ys sharmila counter to cm jagan

25 లక్షల ఇళ్ళు కడతామని మోసం చేయడానికి సిద్ధమా ? లిక్కర్,మైనింగ్ మాఫియా కు సిద్ధమా ? దేనికి సిద్ధం? మీరు సిద్ధమైతే…ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధమని హెచ్చరించారు. మ్యానిఫెస్టో నాకు బైబిల్ తో సమానం అన్నాడు జగన్ అన్న గారు. ఐదేళ్ళలో పూర్తి మద్య నిషేదం అన్నాడు. మద్య నిషేదం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు. మరి చేశాడా..? ఇదేనా మాట తప్పను మడమ తిప్పను అంటే..అంటూ నిలదీశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. తిరుపతి సభలో మోడీ పదేళ్లు హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు 15 కావాలన్నారు.. జగనన్న గారు మూకుమ్మడిగా రాజీనామాలకు పిలుపునిచ్చాడు. అధికారంలోకి వచ్చాక ఎంత మందితో రాజీనామాలు చేయించారని చురకలు అంటించారు. కానీ ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version