జమిలీ ఎన్నికల బిల్లు పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

కేంద్ర ప్రభుత్వం నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లు పై ఏపీ పీసీసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం పై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని విమర్శలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమలులోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశ పెట్టడం బీజేపీ నిరంకువ విధానానికి నిదర్శనం అని మండిపడ్డారు. అసెంబ్లీల గడువును లోక్ సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం పై బీజేపీ దాడి జరుగుతూనే ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమలులోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. జమిలీ ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్ సభలో ప్రవేవపెట్టింది.. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశ పెట్టడం బీజేపీ నిరంకువ విధానానికి నిదర్శనం అన్నారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజార్టీ బీజేపీకి లేదని లోక్ సభలో ఓటింగ్ తో తేలింది. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి..? అని ప్రశ్నించారు. చివరికీ ఓటింగ్ వ్యవహారం బీజేపీకి బెడిసి కొట్టిందని పేర్కొన్నారు షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version