YS Sharmila : షర్మిల కొడుకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?

-

షర్మిల ఇంట్లో పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి. షర్మిల మరియు అనిల్ దంపతుల కుమారుడు వైయస్ రాజరెడ్డి వివాహం చేసుకోనున్నారు. ఆయన మ్యారేజ్ కు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. దీంతో వారి ఇంట్లోకి వచ్చే అదృష్టవంతురాలు ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి అందరికీ ఉంటుంది. తాజాగా రాజారెడ్డి తో ఏడు అడుగులు వేసే అమ్మాయి గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు.

Sharmila’s son’s wedding time fixed

రాజారెడ్డిని పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి అని అందరికీ తెలిసిందే.
ఈమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి . ప్రియ కి యూఎస్ సిటిజెన్ షిప్ ఉండడం వల్ల అక్కడే స్థిరపడింది. గత నాలుగేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు .ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లిన రాజారెడ్డికి అక్కడ ప్రియ అట్లూరితో పరిచయం అయ్యింది. వారు తక్కువకాలంలోనే స్నేహితులుగా మారి ప్రేమించుకున్నారు. వీరి ఇద్దరి పెళ్లికి వైయస్ షర్మిల మరియు అనిల్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అలాగే ప్రియా కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చే సంవత్సరం మే లో వీరి వివాహం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version