ఏపీ వలంటీర్లకు షాక్. సమ్మెలో పాల్గొన్న వలంటీర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముగ్గురు వలంటీర్లపై వేటు పడింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ముగ్గురు వార్డు వలంటీర్లను విధులనుంచి తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తమకు రూ. 18 వేల జీతం ఇవ్వాలని, రెగ్యులర్ ఇవ్వాలని పలుచోట్ల వలంటీర్లు సమ్మె నోటీసులు ఇస్తున్నారు.
కాగా, తెలంగాణ రాహ్త్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఏపీలోను ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తోంది. అటు టీడీపీ జనసేన కూటమి కూడా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక కాంగ్రెస్ సైతం ఉనికి చాటుకునేందుకు ఆలస్యంగా రేసులోకి వచ్చింది. అయితే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అనేక సంస్థలు సర్వేలను వెల్లడిస్తున్నాయి. మెజారిటీ సర్వే ఫలితాలు వైసీపీ కి అనుకూలంగా వస్తున్నాయి.