నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి – సోమిరెడ్డి సంచలనం

-

నారా లోకేష్‌ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్‌ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నానని ట్వీట్‌ చేశారు. ఆ పదవికి నారా లోకేష్‌ వంద శాతం అర్హులేనని తెలిపారు.

Somireddy Chandra Mohan Reddy on nara lokesh

రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని గుర్తు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లోకేష్ బాబు పోరాటపటిమను చూసి టీడీపీ పార్టీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టిందని తెలిపారు. డిప్యూటీ సిఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నానని డిమాండ్‌ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news