బ్రేకింగ్ : రాష్ట్రంలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు

-

తెలంగాణలో ఆదివారం ఉదయం ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు, ప్రాణాపాయస్థితిలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం కోసం లక్షలు ఖర్చవుతాయి. అందుకే పేద, మధ్యతరగతి రోగులకు ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. అలాంటి ప్రభుత్వ స్కీంను ప్రైవేట్ ఆస్పత్రులు విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ప్రభుత్వం నుంచి వారికి రూ.వెయ్యి కోట్లకు మేర ఆరోగ్య శ్రీ బకాయిలు రావాల్సి ఉన్నదని తెలుస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమై ఆరోగ్య శ్రీ నిధుల విడుదలపై చర్చించారు.నేటికి ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసినట్లు ఆస్పత్రుల యజమాన్యం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news