అంబేద్కర్‌ పై సోము వీర్రాజు వివాదస్పద వ్యాఖ్యలు

-

అంబేద్కర్‌ పై సోము వీర్రాజు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుక నిర్వహించారు. బీజేవీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలేసి నివాళులర్పించిన సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశ భక్తి కలిగిన భారతీయుడు అంబేద్కర్ అని… ప్రతి అంశంపైనా ఆయనకు చాలా స్పష్టత ఉందని తెలిపారు.

పాకిస్తాన్ విభజన అంబేద్కరుకి అసలు ఇష్టం లేదని.. ఆనాడు‌ చెరువుల్లో కూడా దిగనీయని పరిస్థితి ఉందన్నారు. అగ్ర వర్ణాలతో కలిసి నడవకూడని దుస్థితి అని.. ఇవన్నీ అంబేద్కర్ ప్రత్యక్షంగా చూడటం ద్వారా ఆలోచన కలిగిందని తెలిపారు. అందుకే అన్ని అంశాలను సునిశితంగా ఆలోచించే వారని.. సంస్కృతి దేశ భాషగా ఉండాలని అంబేద్కర్ చెప్పారని వెల్లడించారు.

సమాజంలో ఆ వర్గం కోసం‌ పోరాడుతూ, రిజర్వేషన్ కల్పించారని.. రాజ్యాంగం రచించి.. అన్ని వర్గాల వారికి స్వేచ్చను కలిగించారని స్పష్టం చేశారు. భారతదేశంలో ఉన్న మూలాలపై సమగ్రంగా అధ్యయనం చేశారని.. ఎన్ని కష్టాలొచ్చినా లక్ష్యాల నుంచి పక్కకు జరగలేదని వెల్లడించారు. అంబేద్కర్ జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని.. అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకుంటూ బీజేపీ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అంబేద్కర్ ఆలోచనా‌ విధానాలనే మోడీ అమలు చేస్తున్నారని.. సమ్మిళత అభివృద్ధిలో భాగంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన రూ. 18.60కోట్ల మందికి లబ్ది జరగుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version