2024లో అవరసరమైతేనే జనసేనతో పొత్తు ఉంటుంది – సోమువీర్రాజు

-

ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది బీజేపీ తో సాధ్యమని…2024లో జనసేన కోరుకుంటే బీజేపీ తో పొత్తు వుంటుందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. అవసరమైతే జనంతో పొత్తు, జనసేనతో పొత్తు వుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం లో పాకిస్తాన్ జిందాబాద్ అనే పరిస్థితులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువులపై దాడులు జరుగుతున్న చర్యలు తీసుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని జగన్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు.ఆంధ్ర హిందువులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వాహనాలను కుయ్యో కుయ్యో మని మోగుతున్నాయి.. కానీ ఎవరి రాష్ట్రం ఎవరి శవాలు వారే మోసుకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు సోము వీర్రాజు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో యోగి, మోడీ లాంటి నాయకులు అధికారం లోకి రావాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version