ప్రక్షాళన: వీర్రాజు వీరంగం స్టార్ట్… సుజనా చౌదరికి షోకాజ్ నోటీస్ రెడీ?

-

ఏపీ బీజేపీలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు… దూకుడు స్టార్ట్ చేసినట్లేననే సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వ్యక్తుల అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలే ముఖ్యమని భావిస్తూ ముందుకుపోతానని చెబుతున్న సోము వీర్రాజు.. తాజాగా ఒక కీలకనిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు! దానికి హింట్ ఇచ్చింది.. ఏపీ బీజేపీ తాజా ట్వీట్!

ఏపీ బీజేపీలో బీజేపీకోసం పాటుపడేవారికంటే.. బీజేపీ అభివృద్ధిని కాంక్షించేవారికంటే.. బాబు క్షేమం కోరుతూ, టీడీపీ మనుగడ ప్రాశ్నార్ధకం కాకుండా చూసేవారే ఎక్కువ అని గతకొన్ని రోజులుగా రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోన్న మాట. ఇదే మాటను “పసుపు మిడతల దండు”గా అభివర్ణించారు విజయసాయిరెడ్డి కూడా! ఈ క్రమంలో బీజేపీలో ఉండాలి అనుకుంటే.. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు అనుగుణంగా నడవాలని.. అలాకాని పక్షంలో తాటతీస్తామని హెచ్చరికలు పంపే పనికి సోము వీర్రాజు పూనుకోబోతున్నారని.. ఫలితంగా పార్టీ ప్రక్షాళనకు పూనుకున్నారని అంటున్నారు విశ్లేషకులు!

ఇందులో భాగంగా… ట్విట్టర్ వేదికగా సుజనా చౌదరికి వార్నింగ్ బెల్ మోగించింది ఏపీ బీజేపీ! తాజాగా ట్విట్టర్ లో స్పందించిన ఏపీ బీజేపీ… “రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపి శ్రీ సుజనా చౌదరి గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ.. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు స్పష్టం చేశారు.” అని పేర్కొంది! దీన్నే… సుజనాకు వార్నింగ్ బెల్ గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు!

“కన్నా” ఉన్నప్పుడు ఈ విషయంలో.. బీజేపీలో ఉన్న బాబు అభిమానులు, అనుచరులంతా ఇదే విధంగా ఎప్పుడు, ఎలా, ఏ వేదికపై మాట్లాడినా.. దానిపై స్పందించేనాథుడు ఉండేవాడు కాదు. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకునే టీడీపీ & వారి అనుకూల మీడియా.. కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలో పాడేసేది! కానీ… వారెవరికీ సోము వీర్రాజు ఆ ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు సరికదా… “తోక జాడిస్తే కట్ చేస్తా” అన్న రేంజ్ లో సంకేతాలు పంపుతున్నారు!

ఈ క్రమంలో… క‌ల్యాణ్‌ సింగ్‌, ఉమాభార‌తి లాంటి అగ్ర‌నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సైతం వెనుకాడ‌ని బీజేపీ అధిష్టానం… సుజ‌నా చౌద‌రి విష‌యంలో మాత్రం ఎందుకు వెనకడుగు అడుగువేయాలనేది వీర్రాజు ఉద్దేశ్యం కావచ్చు! వీర్రాజు ఉద్దేశ్యం కన్వెన్స్ గానే ఉందని పార్టీ పెద్దలు కూడా భావిస్తే… సుజనా చౌదరికి షోకాజ్ నోటీస్ రెడీ అయినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version