సింగర్ మనో బాపట్ల కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. చందోలు బంగ్లాముఖి దేవాలయానికి వెళ్తూ కలెక్టర్ ని ఆయన కలిశారు. జిల్లా గీతం స్వరకల్పన పై చర్చించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా గేయానికి స్వరకల్పన చేయాలని తాము కోరినట్లు కలెక్టర్ చెప్పారు. అడిగిన వెంటనే మనో అంగీకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అయితే బాపట్ల జిల్లా గీతాన్ని తయారు చేయాలని గత ఏడాది తాను ఆదేశాలు జారీ చేశానని, భావపరి పుస్తకోద్యమ సమితి సభ్యులు ముందుకొచ్చారని తెలిపారు. బాపట్ల చరిత్ర ప్రతిబింబించే విధంగా గీతాన్ని రచించాలని రచయితలకు విజ్ఞప్తి చేస్తూ తాను పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ పోటీలకు వచ్చిన పది ఎంట్రీలను అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలించారని చెప్పారు. భావపురి రచయుతల సంఘం కార్యదర్శి నందిరాజు విజయ్ కుమార్ రచించిన గీతాన్ని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా విశిష్టతపై ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సభ్యులు ప్రచురించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా మనోకు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు.