కరివేపాకు అన్ని వంటల్లో వేసుకుని అలవాటును మన పూర్వీకులు మనకు నేర్పించారు..ఈరోజుకి కొన్ని వంటల్లో కరివేపాకు లేకుండా తాలింపు పెట్టరు..మరికొంతమంది అయితే.. ప్రతిదానిలోనూ కరివేపాకు వాడుతుంటారు. కానీ చాలామంది దీన్ని తినేప్పుడు తీసి పక్కన పడేస్తుంటారు. కంటి ఆరోగ్యానికి కరివేపాకు ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. కానీ తినరే..లోపలకు పంపిస్తే..ఎన్ని లాభాలు ఉంటాయో తెలిసినప్పటికీ..దాన్ని నమలలేక తినేప్పుడు ఏరిపారేస్తారు..పొడి రూపంలో చేసుకున్నా మంచిదే..కరివేపాకు..కంటికే..కాదు..జుట్టుకు కూడా చాలా మంచిది..ఈరోజు కరివేపాకు వల్ల ఉండే లాభాలు కొన్ని వివరంగా చూద్దాం.
కరివేపాకును పేస్ట్ చేసేసి..తలకు పెడితే..అనేక లాభాలు ఉంటాయి. చుండ్రుపోగట్టడానికి, చుండ్రు రాకుండా ఉండటానికి, జుట్టు బాగా ఏదిగేటట్లు చేయడానికి, హెయిర్ రూట్స్ కొత్తవాటిని డవలప్ చేయటానికి., గ్రే హెయిర్ త్వరగా రాకుండా రక్షించడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుందని పరిశోధన ద్వారా నిరూపించారు. 2020లో ప్రవర రూరల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మహారాష్ట్ర( Pravara Rural College Of Pharmacy Maharashtra) వారు పరిశోధన చేసి కనుగొన్నారు. ఈ అధ్యయనంలో ఏం చెప్తున్నారంటే..
ఈ కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్స్ ( Alkaloids) అనేవి తలలో ఉండే స్కిన్‌ని డ్రైనెస్ రాకుండా , చుండ్రురాకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతున్నాయట.అలాగే కరివేపాకులో ఉండే టర్పినాయిడ్స్( Terpenoids) ఆల్కలాయిడ్స్ ఈ రెండింటి కాంపోజిషన్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల కరివేపాకును పేస్ట్ చేసి తలలో పెట్టినప్పుడు తలలో ఉండే బాక్టీరియాలను, ఫంగస్ క్రిములను ఈ రెండు చంపేస్తాయి. అసలు చుండ్రు రావడానికి ప్రధాన కారణం..బాక్టీరియల్ ఇన్ఫెక్షన్..
అతిముఖ్యమైన రెండో లాభం ఏంటంటే..చిన్నవయసులోనే చాలామందికి తెల్లజుట్టు వచ్చేస్తుంది. వారసత్వంగా వచ్చే తెల్లజుట్టను మాత్రం రాకుండా ఆపడం సాధ్యం కాదు..కానీ కొంతమందికి పోషకాహార లోపం వల్ల గ్రే హెయిర్ వస్తుంది..అలాంటి వారికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిడేటీవ్ స్ట్రేస్ వల్ల మన రక్షణ వ్యవస్థ జుట్టు కుదుళ్ల దగ్గర ఉండే..నలుపు వర్ణాన్ని ఉత్ప్తి చేసే మెలనోసైట్ కణజాలాన్ని డామేజ్ అయ్యేట్లు మన రక్షణ వ్యవస్థ చేస్తుంది. దానివల్ల నలుపు వర్ణం విడుదల అవ్వదు కాబట్టి జుట్టు తెలుపుగా అవుతుంది. ఈ మెలనోసైట్స్ యొక్క డామేజ్‌ను అరికట్టడానికి, రక్షణ వ్యవస్థను స్టెబిలైజ్ చేయడానికి కరివేపాకు బాగా ఉపయోగపుడుతుంది. కాబట్టి తరుచూ కరివేపాకు పేస్ట్‌ను తలకు పెడుతుంటే..గ్రేహెయిర్ తగ్గడానికి, త్వరగా రాకుండా చేయడానికి పనికొస్తుంది.
పరిశోధనలో వెల్లడించిన మూడవలాభం ఏంటంటే..కరివేపాకు అన్నింటికంటే..అత్యధికంగా బీటాకెరోటిన్‌ను కలిగి ఉంటుంది. 100 గ్రాముల కరివేపాకులో సుమారుగా 7500 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ ఉంటుంది. మనకు ఒకరోజుకు 2400 మైక్రోగ్రాములు సరిపోతుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనికొస్తుంది. ఈ బీటాకెరోటిన్ శరీరానికి సరిపడా అందించినప్పుడు హెయిర్ పోలికల్స్‌ను త్వరగా పునరుత్పత్తి చేసేట్లుగా బ్రహ్మండంగా ఉపయోగపడుతుందట. జుట్టు కుదుళ్ల నుంచి గ్రోత్ బాగా రావడానికి ఈ బీటాకెరోటిన్, ఎమైనో యాసిడ్స్( Amino acids),విటమిన్ C ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి.
కరివేపాకును పేస్ట్ చేసి ఆ పేస్ట్ తలకు పట్టించి ఒక అరగంట గంటపాటు ఉంచుకుని తలస్నానం చేయడం వల్ల ఈ లాభాలు అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇది పేస్ట్ చేయడం పెట్టడం క్లీన్ చేసుకోవటం కాస్త టైంతో కూడుకున్న పని..ఇంకా సులభమైన మార్గం ఒకటి ఉంది. కరివేపాకు ఆయిల్ మార్కెట్‌లో లభిస్తుంది. అయితే కాస్త కాస్ట్ ఎక్కువ. 100 గ్రాముల కరివేపాకు ఆయిల్ 400- 500 రూపాయలు ఉంటుంది. ఈ ఆయిల్ అప్లై చేసినా అవే లాభాలు ఉంటాయి..కాకపోతే ఖరీదైనంది..చీప్ అండ్ బెస్ట్‌లో పేస్ట్ పెట్టుకుంటే సరి..
ఈ రోజుల్లో జుట్టు సమస్యలో ఎంతో మంది బాధపడుతున్నారు..అలాంటి వారు..వారానికి ఒకసారి కరివేపాకు ఆయిల్‌ను కానీ, పేస్ట్‌ను కానీ అప్లైయ్ చేసుకుంటూ కాస్త పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకుంటుంటే మీ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు.