నెల్లూరు మైనర్ బాలికపై యాసిడ్ దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ విజయారావు

-

నెల్లూరు లో మైనర్ బాలికపై యాసిడ్ దాడి చేసిన నాగరాజు ను అరెస్ట్ చేశామని తెలిపారు నెల్లూరు ఎస్పీ విజయారావు. బాలిక ఇంటి వద్దే నాగరాజు నివసిస్తున్నాడని.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. బాలిక పై యాసిడ్ తో దాడి చేయడంతో పాటు కత్తి తో గాయపరిచాడని అన్నారు. బాలికను మెరుగైన వైద్యం కోసం చెన్నై కి తరలించామన్నారు. మైనర్ బాలిక పై దాడి జరగడం శోచనీయం అన్నారు.

బాలికకు నాగరాజు వరుసకు మేనమామ వరసవుతారని తెలిపారు. నాగరాజు పై ఫోక్సీ కింద కేసు పెట్టామన్నారు. వివిధ సెక్షన్ ల కింద కూడా కేసు పెట్టామన్నారు. మద్యం సేవించి ముందస్తు పథకం ప్రకారమే దాడి చేశాడని అన్నారు. కత్తితో దాడి చేసినా పెద్దగాయం కాకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. నాగరాజు పై రౌడి షీట్ కూడా ఓపెన్ చేశామని.. ఏడూ రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసి నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version