టీడీపీ నేతలపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు

-

టిడిపి సభ్యుల చేష్టలపై మాట్లాడాలంటే నాకు బాధగా ఉంది శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభ్యులు శాసనసభ నియమావళి సాంప్రదాయాలు పాటించాలి..తాను శాసనసభలో ఉన్నాను బాధ్యతగా వ్యవహరించాలని సభ్యులకు ఉండాలి. సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిని.. తాను జగన్ ఇచ్చిన టికెట్ పైన గెలుపొందాను.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అనే కోణంలోనే టీడీపీ వారు చూస్తున్నారు. శాసనసభాపతిగా సభలో తారతమ్య భేదం లేకుండా చూస్తున్నాను. విశాఖ నుంచి పరిపాలన రాజధాని ప్రారంభమవుతుంది. సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారు. అచ్చెన్నాయుడు, బాలకృష్ణకు అనేకసార్లు చెప్పాం. వారు  వినలేదు..ప్రిపెడ్ మైండ్ తోనే టీడీపీ సభ్యులు వచ్చారు. సభను అడ్డుకోవాలని చూశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై డిస్కషన్ కు పెట్టాము. వారు సద్వినియోగం చేసుకోలేదు. టిడిపి అధినేతను అరెస్టు చేశారు దానిని ప్రభుత్వం పై ఆపాదిస్తున్నారు.

ప్లకార్డులు ప్రదర్శించడం విజిల్స్ వేయడం అక్కడున్నటువంటి సామానులు ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు.. ముఖ్యమంత్రిగా గెలిచి చంద్రబాబు సభలో అడుగుపెడతానన్నారు అది అయన వ్యక్తిగత అభిప్రాయమని.. చంద్రబాబు అరెస్టుపై ముందుగానే సమాచారం ఇచ్చారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ కేసు ఫైల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news