భక్తులకు బిగ్ షాక్ తగిలింది. అన్నవరంలో ప్రత్యేక దర్శన టికెట్ రూ.300కు పెంచారు అధికారులు. కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ప్రదక్షిణ ప్రత్యేక దర్శన టికెట్ ధరను రూ.300 కు పెంచినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి కొత్త ధర అమల్లోకి వస్తుందన్నారు. ప్రధాన ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ బంగారు కల్పవృక్షం, బంగారు కామదేనువు, బంగారు హుండీ, బంగారపు గంధపు గిన్నెలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీ వారి భక్తులకు శుభవార్త అందింది. క్యూ లైన్ లో వేచివుండే అవసరం లేకూండా శ్రీ వారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. నిన్న భక్తుల రద్దీ కాస్త తగ్గింది. దీంతో తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్కరోజే 72309 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.