పిఠాపురం కౌంటింగ్‌ కేంద్రాలపై స్పెషల్‌ ఫోకస్‌ !

-

పిఠాపురం కౌంటింగ్‌ కేంద్రాలపై స్పెషల్‌ ఫోకస్‌ చేశారు ఎన్నికల అధికారులు. కాకినాడ జిల్లాలో 1640 పోలింగ్ కేంద్రాల లో 1312255 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 18,470 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుళ్ళు ఏర్పాటుచేశారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 18 మంది సూపర్వైజర్లు, 18 మంది సహాయకులు 18 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు.

Special focus on Pithapuram counting centers

పెద్దాపురం 15 రౌండ్లు, తుని 16రౌండ్లు, కాకినాడ సిటీ ప్రత్తిపాడు 17 రౌండ్లు, పిఠాపురం 18 రౌండ్లు, కాకినాడ రూరల్ లో 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఒకేసారి జరగనున్న కాకినాడ పార్లమెంట్ తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ జరుగనుంది. కౌంటింగ్ జరగనున్న జేఎన్టీయూ రెండు కిలోమీటర్ల పరిధి రెడ్ జోన్ గా ప్రకటన చేశారు. జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెఇలపారు. 1500 మంది పోలీసులు , కేంద్ర బలగాలతో జెఎన్టియు దగ్గర పర్యవేక్షణ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version