ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అలర్ట్. ప్రత్యేకంగా మహిళల కోసం వాట్సాప్ నెంబర్ ను క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్. మహిళలు అలాగే చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు శక్తి పేరుతో.. 7993485111 వాట్సప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

అత్యవసర పరిస్థితులలో ఉన్నప్పుడు ఈ నెంబర్కు వాయిస్ లేదా వీడియో కాల్.. మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ ద్వారా స్థానికంగా ఉండే శక్తి బృందాలకు సమాచారం చేర్చి… వారు రక్షిస్తారన్నమాట. 24 గంటలు ఈ వ్యవస్థ పని చేస్తుంది. మహిళలు ఈ నెంబర్ను తమ ఫోన్ లో సేవ్ చేసుకోవాలని డిజిపి హరీష్ సూచనలు చేశారు. దీంతో మహిళలు సంబరపడిపోతున్నారు.