తిరుమల సన్నిధిలో కలకలం. తిరుమల శ్రీవారి భక్తుల నగలు చోరీ అయ్యాయి. 16 గ్రాముల బంగారు నగలు అపహరణ చేశారు దొంగలు. విష్ణు నివాసంలోని రూమ్ నెంబర్ 613 లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ,కూకట్ పల్లిలోని ప్రగతి నగర్ కు చెందిన శ్రీదేవి కుటుంబం శ్రీవారి దర్శనానికి రానున్నారు.

రూమ్ లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నగలు కాజేయడంతో ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.