సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. రేపటి నుంచే బుకింగ్స్..!

-

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పండుగ వేళ రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ -కాకినాడ టౌన్, హైదరాబాద్-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 09, 10, 11, 12 తేదీలలో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం జనవరి 02వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. 

Train

ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలుంటాయని పేర్కొన్నారు. కాచిగూడ-కాకినాడ టౌన్ రైలు జనవరి 09, 111 తేదీలలో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకోనుంది. కాకినాడ టౌన్-కాచిగూడ రైలు ఈనెల 10, 12 తేదీలలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయాన్నే 4.30 గంటలకు కాచిగూడ చేరుకోనుంది. అలాగే హైదరాబాద్-కాకినాడ పట్టణం రైలు జనవరి 10న హైదరాబాద్ లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. జనవరి 11న రాత్రి 8 గంటలకు కాకినాడలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంలకు మైదరాబాద్ చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news