ఈ నెల 23న తిరుప‌తికి శ్రీ‌లంక ప్ర‌ధాని మ‌హింద్ర రాజ‌ప‌క్సే

శ్రీ‌లంక ప్ర‌ధాన మంత్రి మ‌హింద్ర రాజ‌ప‌క్సే తిరుమ‌ల ప‌ర్య‌ట‌నకు రానున్నారు. ఈ నెల 23, 24 తేదీల‌లో రెండు రోజుల తిరుప‌తిలో నే ఉండ‌నున్నారు. ఈ నెల 23 న రేణిగుంట విమానాశ్ర‌యానికి ఉద‌యం 11 గంట‌ల‌కు చేరుకుంటారు. త‌ర్వాత ఈ నెల 24న తిరుప‌తిని ద‌ర్శించుకోనున్నారు. తిరుప‌తి లో బ్రేక్ ద‌ర్శ‌నం లో భాగం గా.. శ్రీ‌లంక ప్ర‌ధాన మంత్రి మ‌హింద్ర రాజ‌ప‌క్సే కుటుంబం శ్రీ వారి సేవ‌లో పాల్గొంటారు. అనంత‌రం తిరిగి శ్రీ‌లంకు ప‌య‌నం అవుతారు.

కాగ శ్రీ‌లంక దేశానికి ప్ర‌ధానిగా వ్య‌వహ‌రించిన వాళ్ల‌లో చాలా మంది తిరుప‌తి ద‌ర్శ‌నానికి వ‌చ్చే వారు. ప్ర‌స్తుతం శ్రీ‌లంక కు ప్ర‌ధాన మంత్రి గా ఉన్న మహింద్ర రాజ‌ప‌క్సే కుటుంబ స‌మేతంగా ఈ నెల 23 తిరుప‌తి లో వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోనున్నారు. కాగ ప్ర‌స్తుతం ప్ర‌ధాని గా ఉన్న మ‌హింద్ర రాజ‌ప‌క్సే గ‌తంలో కూడా చాలా సార్లు తిరుప‌తి ప‌ర్య‌ట‌న కు వ‌చ్చి వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు.