తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్…!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎంతోమంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి వారి కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. SSC, ఆర్ ఆర్ బీ, గ్రూప్ -1, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి తెలంగాణ బీసి స్టడీ సర్కిల్ కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ నెల 28 వరకు ధరకాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఈ తేదీల లోగానే అప్లై చేసుకోవాలని చెప్పారు.

అంతే కాకుండా పూర్తి వివరాల కోసం www.study circle.cgg.gov.in అనే వెబ్ సైట్ ను చూడాలని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది విద్యార్థులు నగరాలు, పట్టణాల్లో కోచింగ్ సెంటర్ లకు వెళుతున్నారు. వేలకు వేలు డబ్బులను ఫీజులు కడుతున్నారు. అయితే ఇప్పుడు బిసి స్టడీ సర్కిల్ ద్వారా బిసి అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ లభించనుంది.