తిరుమలలో ఈనెల 17 నుంచి శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

-

ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. 22వ తేదీన నారాయణగిరి ఉద్యాన వనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తిరుమలలోని ఆకాశగంగ వద్ద బాలాంజనేయ స్వామివారి ఆలయంలో జూన్‌ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హనుజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే  వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

మరోవైపు తిరుమల శ్రీవారిని ఏప్రిల్‌ నెలలో 20.17 లక్షల మంది దర్శించుకున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. హుండీ కానుకలు  రూ.101.63 కోట్లు లభించినట్లు వెల్లడించారు. భక్తులు 94.22 లక్షల లడ్డూలు కొనుగోలు చేశారని.. అన్నప్రసాదం 39.73 లక్షల మంది స్వీకరించారని చెప్పారు. స్వామివారికి   8.08 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వివరించారు. వేసవి సెలవుల దృష్ట్యా పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news