జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతను పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరించారంటూ జనసేన వివరణ ఇచ్చింది. రాయుడి హత్యకేసులో వినుత, ఆమె భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ తరుణంలోనే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా అనుమానాస్పద స్థితిలో జనసేన కార్యకర్త మృతి చెందాడు. చెన్నైలోని మురికి కాలువలో శవమై కనిపించాడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ ఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పీఏగా పనిచేస్తున్నాడు రాయుడు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతపై సస్పెన్షన్ వేటు పడింది.