మీరే హారతులు ఇచ్చుకుంటే..అర్చుకులు ఎందుకు ? అంటూ సాయిధరమ్ తేజ్ పై శ్రీకాళహస్తీస్వర ఆలయ పరిరక్షణ సమితి ఆగ్రహించింది. హీరో సాయిధరమ్ తేజ హారతీ పై సీరియస్‌గా రియాక్టు అయ్యారు పండితులు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీస్వర ఆలయ పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు సింగిరాజు బాలసుబ్రహ్మణ్యం శాస్త్రి మాట్లాడుతూ.. పెద్దవారు పెట్టిన సాంప్రదాయాలను ఎవరూ మార్చ లేరని.. అలాచేస్తే సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడమేనన్నారు.
ఆలయాలలో దేవతలు కు పూజలు, అర్చనలకు అభిషేకాలు,హారతులు కు ఒక ఆచారం సాంప్రదాయం అనేది ఉందని… ఎవరంటే వారు వెళ్లి గుడిలోకి వెళ్లి దేవతలకు నైవేద్యాలు పెట్టడం, హారతులు ఇవ్వడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఇలా ఎవరికి వారు హారతులు ఇస్తే ఇక అర్చకులు ఎందుకు ఉండేదని.. రాను రాను సాంప్రదాయాలను తుంగలోకి తోక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.