విమర్శల కోసం విపక్షాలు విద్యుత్ కాకుండా వేరే రంగాలను ఎంచుకోవడం బెటర్ : నిరంజన్‌రెడ్డి

-

విమర్శల కోసం విపక్షాలు వేరే రంగాలను ఎంచుకోవడం మంచిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కరెంట్ షాక్ తగిలిందని ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని విజ్ఞత చూపాలని అన్నారు. రేవంత్‌ రెడ్డి.. తన వ్యాఖ్యలపై రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇంతగా అండ ఉన్న ప్రభుత్వం.. 70 ఏళ్లలో ఏదీ లేదని తేల్చి చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులు సాగు కొనసాగిస్తున్నారని.. కాంగ్రెస్‌ నేతల విధాన రూపకల్పన దిల్లీ నుంచి జరగాలని అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని స్పష్టం చేశారు.

‘కాంగ్రెస్‌ పాలనలో 9 గంటలు మాత్రమే విద్యుత్‌ ఇచ్చారు. ఆ ఇచ్చిన 9 గంటలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్‌ కూడా కీలకమైన అంశం. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ విద్యుత్‌ అంశంపై లేఖ రాశారు. చరిత్ర తెలియని వారు.. చరిత్రలో భాగస్వామ్యం లేని వారు ఏదేదో మాట్లాడుతున్నారు. విద్యుత్‌ అంశంపైనే చంద్రబాబుతో కేసీఆర్‌ విబేధించారు. కరెంటు కష్టాలు, తాగునీటి సమస్యపైనే తెలంగాణ మలిదశ ఉద్యమం వచ్చింది’ అని నిరంజన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version