అంబటి ఔట్‌…గుంటూరు వైసీపీ ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు !

-

నరసరావు పేట వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని..నన్ను గుంటూరు నుంచి పోటీ చేయమన్నారని తెలిపారు. నేను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశానన్నారు. గడిచిన ఐదేళ్లలో పల్నాడు ప్రాంతానికి ఎన్నో నిధులు తీసుకొచ్చాను…చాలా పనులు సగం సగం గా ఉన్నాయని చెప్పారు.

Srikrishna Devarayalu as Guntur YCP MP

వాటిని పూర్తిచేయాలని కోరిక ఎంపీ గా నాకు ఉందన్నారు. అధిష్టానం లెక్కలు వేరు గా ఉన్నాయి …నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి …అన్ని విషయాలు అధిష్టానంకు చెప్పానని తెలిపారు నరసరావు పేట వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. వేరే ప్రాంతంలో పోటీ చేసే ఆలోచన లేదు…. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానని ప్రకటించారు నరసరావు పేట వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.

Read more RELATED
Recommended to you

Latest news