అసెంబ్లీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొన్న.. ద్విచక్ర వాహనదారుడు మృతి…!

-

ప్రమాదాలు చెప్పి రావు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలి. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వేగంగా వెళ్లడం లేదంటే ఇష్టానుసారంగా వాహనాలను నడపడం వంటి చిన్న చిన్న పొరపాట్ల వలన ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది. అసెంబ్లీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఒక ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే చనిపోయారు. ఇక దీని గురించి పూర్తిగా వివరాల్లోకి వెళితే…

A terrible accident in AP Three youths died

అసెంబ్లీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడు చనిపోయారు. సైఫాబాద్ నుంచి నాంపల్లి వైపు వెళ్ళేటప్పుడు నిజాం క్లబ్ గేటు ఎదురుగా ఆర్టీసీ బస్సు కింద పడిపోయాడు. వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు. అతను రంగా రెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన శ్రీరాములు అని తెలుస్తోంది. ఈ మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. శవ పరీక్ష నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి శవగారానికి తీసికెళ్ళడం జరిగింది. అలానే, బస్సు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news