ఆంధ్ర కళా కారులను జగన్‌ అవమానిస్తున్నాడు – శ్రీరెడ్డి

-

ఆంధ్ర కళా కారులను జగన్‌ అవమానిస్తున్నాడని శ్రీ రెడ్డి సంచలన పోస్ట్‌ పెట్టింది. ఆంధ్ర లోకూడా మంగ్లీ, కనకవ్వ లాంటి తెలంగాణ జానపద సింగర్స్ ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు జగన్ అన్న ..ఇది ఆంధ్ర జానపద కళాకారురుల్ని అవమానించడమే అన్న..ఆంధ్రాలో శ్రీకాకుళం,కృష్ణ,సీమ,అన్ని రాష్ట్రాల్లో అనేకమంది కళని నమ్ముకుని ఎంకరేజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంది.

వీళ్ళు చచ్చిపోతే ఆంధ్ర కళలు అంతరించి పోయినట్టేనని తెలిపింది. కర్ణాటక (కాంతారా),తమిళనాడు (జల్లికట్టు),తెలంగాణ (బోనాలు ) ఇలా ప్రతి రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలు..మన రాష్ట్రంలో కొండపల్లి బొమ్మలు ,కూచిపూడి నృత్యం ,బందర్ లడ్డులు ,శ్రీకాకుళం గిరిజన నృత్యాలు ,కోలాటాలు ,తిరుపతి,అమరావతి స్థూపాలు,గుహలు ,తడ ఫాల్స్ ,ఉప్పాడ,ధర్మవరం ,మంగళగిరి చీరలు ,చేనేత కార్మికులు,గోదావరి పాపి కొండలు ,వైజాగ్ ఓడ రేవు,రాంపా చోడవరం అడవులు,అరకు అందాలు,రాయల సీమ గొప్పతనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర ప్రత్యేకతలు అనేకం అన్నారు. ఆ తిరుపతి వేంకటేశ్వరుని తో పాటు ,కుబేర లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుని వుంది ఆంధ్ర లో ..జగనన్న మీ కృషి ,దృష్టి ఇంకొంచెం ఈ కళాకారుల మీద పెడితే,అలాగే టూరిజం ఎంకరేజ్ చేస్తే ఆంధ్ర అభివృద్ధి తొందరలో పరుగులు తీస్తుంది అని శ్రీ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version