శ్రీశైలం దేవస్థానం యాఫి ధియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసిబితో చదును చేస్తుండగా బయటపడింది శివలింగం. శివలింగంతో పాటు అదే రాయిపై బయటపడింది నంది విగ్రహం. శివలింగం పక్కనే రాయి పై తెలియని లిపితో రాసి ఉన్న గుర్తులు బయటపడిన శివలింగాన్ని పరిశీలించారు దేవస్థానం అధికారులు.
శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీకి పంపించారు దేవస్థానం అధికారులు. నంద్యాల శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం వద్ద ఉన్న లిపి 14, 15 వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్ర గుండం వద్ద ప్రతిష్టించినట్లు లిపిలో నమోదు అయింది. మరోవైపు మైసూరు కు చెందిన ఆర్కియాలజీ అధికారుల ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు.