ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం : సీఎం చంద్రబాబు

-

దేశంలోని ప్రతీ రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారతీయులు ఉన్న ప్రతీ దేశంలో కూడా బాలాజీ ఆలయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో జరిగిన టెంపుల్స్ కన్వెన్షన్స్ ఈవెంట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేవాలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులన్నారు. కుంభమేళాలో 55కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 

ఇవాళ ప్రతీ ఇంట్లో ఒక ఏఐ నిపుణుడు తయారవుతున్నారు. టెక్నాలజీ వినియోగంతో మనం మరింత ముందుకు వెళ్లాలి. గతంలో తాను ఐటీ గురించి చెప్పాను.. ప్రస్తుతం ఏఐ గురించి చెబుతున్నాను. టెక్నాలజీని మనం వ్యవహరించాలని సూచించారు. కుటుంబ వ్యవస్థ మన దేశానికి అతిపెద్ద బలం. దేశంలో యువత ఎక్కువగా ఉండటం మనకు మరో అదృష్టం. 2047 నాటికి మనం నెంబర్ 01 లేదా నెంబర్ 2 కి చేరుకోవాలి. పీ4 విధానంలో దేశంలో మౌళిక వసతులు మరింతగా పెరగాలన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన నేత ప్రధానిగా ఉన్నారని కొనియాడారు. 

Read more RELATED
Recommended to you

Latest news