తమిళనాడు సీఎం స్టాలిన్ ఇండియా కూటమి పార్టీ నేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని ఆయన కోరారు. కాషాయపార్టీని తిరిగి అధికారంలోకి రాకుండా చూడటమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలన్నారు.
ఆప్ టీఎంసీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన నేపథ్యంలో స్టాలిన్ వాక్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, బీహార్ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. నేడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు నితీష్ కుమార్. ఇక రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం ఉండనుంది.
బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నారు నితీష్ కుమార్. నితీష్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా, కాగా, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీని సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి నెమ్మదిగా చీలుతోంది. ఈ కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి.